IPL 2026 Auction : ఐపీఎల్ 19వ సీజన్ కోసం మినీ వేలం ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా సాగుతోంది. అబుధాబీ అరెనాలో పది ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameroon Green) రూ.25.20 కోట్లతో ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించగా.. జమ్ముకశ్మీర్ పేసర్ అఖీబ్ దార్ (Aquib Dar) అనూహ్యంగా రూ.8.40 కోట్లు పలికాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న దార్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ అతడిని సొంతం చేసుకుంది.
అబుధాబీ వేదికగా ఐపీఎల్ మినీ వేలంలో ప్రతిభావంతులైన క్రికెటర్లపై కోట్ల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రికార్డు స్థాయిలో రూ.25.20కోట్లకు ల్కతా నైట్ రైడర్స్ కొన్నది. గత సీజన్లో చెన్నైకి ఆడిన మథీశ పథిరనను రూ.18 కోట్లకు కోల్‌కతా దక్కించుకుంది. భారత యువ స్పిన్ సంచలనం రవి బిష్ణోయ్ రూ.7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరాడు. గత సీజన్లో రూ.23.75 కోట్లు అందుకున్న వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫ్ఫీని రూ.2 కోట్లకు దక్కించుకుంది ఆర్సీబీ.
Ravi Bishnoi is a ROYAL! 🩷
The spin wizard goes to @rajasthanroyals for INR 7.2 Crore 👏#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/Ac4DU7TXRS
— IndianPremierLeague (@IPL) December 16, 2025
వెస్టీండీస్ స్పిన్నర్ అకీల్ హోసేన్ రూ.2కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొతం కొనేసింది. దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ అన్రిచ్ నోర్జిని రూ.2కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొన్నది. న్యూజిలాండ్ స్టార్ ఫిన్ అలెన్ రూ.2 కోట్లకు కోల్‌కతా పట్టేసింది. బజ్‌బాల్ ఆటతో చెలరేగే ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొన్నది. భారత పర్యటనలో రెచ్చిపోయి ఆడుతున్న క్వింటన్ డికాక్‌ను రూ. 1 కోటికి ముంబై ఇండియన్స్ తమ గూటికి చేర్చుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో దక్కించుకుంది.
Auqib Dar is all set to feature in the #TATAIPL 👌
The all-rounder joins @DelhiCapitals for INR 8.4 Crore 👏👏#TATAIPLAuction pic.twitter.com/RQ1tK7W2RF
— IndianPremierLeague (@IPL) December 16, 2025