Mamata Banerjee | కోల్‌కతా స్టేడియం ఘటన.. స్పోర్ట్స్ మినిస్టర్ రాజీనామాకు బెంగాల్ సీఎం ఆమోదం
Mamata Banerjee | అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Leonal Messi) పర్యటన సందర్భంగా గత ఆదివారం పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లోని సాల్ట్ లేక్ స్టేడియం (Salt lake stadium) లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
Mamata Banerjee : అర్జెంటీనా (Argentina) ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Leonal Messi) పర్యటన సందర్భంగా గత ఆదివారం పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లోని సాల్ట్ లేక్ స్టేడియం (Salt lake stadium) లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఉద్రిక్తతలకు బాధ్యత వహిస్తూ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ (Sports minister) అరూప్ బిశ్వాస్ (Aroop Biswas) తన పదవికి రాజానామా చేయగా.. ఆ రాజీనామాకు సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee) ఆమోదముద్ర వేశారు.
సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వారిని లోపలికి పంపడంలో ఆలస్యం జరిగింది. మెస్సీ కార్యక్రమం ముగించుకుని వెళ్లేసరికి ఇంకా సగం మంది స్టేడియం బయటే ఉన్నారు. దాంతో తమ దగ్గర డబ్బులు వసూలు చేసి స్టేడియంలోపలికి ఎందుకు అనుమతించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవెంట్ నిర్వాహకుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. స్టేడియంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
ఈ ఘటన రాజీకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. మెస్సీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆ రాజీనామాకు సీఎం మమతా బెనర్జి ఆమోదముద్ర వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

