సిద్దిపేటలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం
- ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, జనవరి 16: అంతర్జాతీయ స్థాయి ఆభరణాల షాపింగ్‌మాల్ సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ షాపింగ్‌మాల్‌లో వివాహ ఆభరణాల కొనుగోళ్లకు ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని, ఆభరణాలు అందుబాటు ధరల్లో ఉన్నాయని షోరూం నిర్వాహకులు తెలిపారు. మొదట షాపింగ్ చేసిన వారికి సంస్థ ప్రతినిధి పీకే సిరాజ్‌తో కలిసి మంత్రి ఆభరణాలు అందించారు.
ఉద్యోగాలు ఊడగొట్టుడే బీజేపీ నినాదం : హరీశ్‌రావు
ఉద్యోగాలు ఊడగొట్టడం.. నిరుద్యోగుల పొట్టగొట్టుడే బీజేపీ నినాదమని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లోని గుర్రాలగొందికి చెందిన బీజేపీ జిల్లా నాయకులు పటెండ్ల రాజారాం, బోయిని ఎల్లం వారి అనుచరులతో కలిసి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలతో రైతులను రాబందుల్లా చూసిందని, ఇప్పుడు ఎరువుల ధర పెంచి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. సోషల్ మీడియా అబద్ధాల ప్రచారం ఎక్కువ కాలం సాగదని హితవు పలికారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

