మక్తల్ : మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రాంమోహన్ రెడ్డితోనే ( Rammohan Reddy) నియోజకవర్గం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) అన్నారు. బుధవారం బీఆర్ఎస్ మక్తల్ పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, నాయకులు గాల్ రెడ్డి, ఉజ్జల్లి రవికుమార్, మామిళ్ళ అమ్రేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు కొందరు మాజీ ఎమ్మెల్యేపై ( Former MLA) అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రిజర్వాయర్ , నీళ్లపై, చెరువులపై అవగాహన లేని నాయకులు చిట్టంను విమర్శించడం శోచనీయమని అన్నారు. గడిచిన 18 సంవత్సరాలలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గడపను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. మంత్రి శ్రీహరి మెప్పు పొందేందుకు మాజీ ఎమ్మెల్యేను విమర్శిస్తే నియోజకవర్గంలో హైప్ పెరుగుతుందనే ఉద్దేశంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు.
గతంలో చిట్టెం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మక్తల్ నియోజకవర్గ కేంద్రానికి 150 పడకల ఆసుపత్రి, కోర్టు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్లను తీసుకువచ్చారని వివరించారు. చెరువులు నింపామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు తమతో కలిసి ప్రాజెక్టుల పరిధిలోని చెరువుల వద్దకు వస్తే వాస్తావాలు తెలుస్తాయని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ గౌడ్, నాయకులు అన్వర్ హుస్సేన్,జుట్ల శంకర్, కురవ వినోద్, మన్నన్,సురేష్,హనుమంతు,తిమ్మప్ప,ఆంజనేయులు తదితరులు ఉన్నారు.