Maktal Municipal Polling | మక్తల్, ఏప్రిల్ 18: మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డుకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా శనివారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 20.51 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. ఆరో వార్డులో బీజేపీ అభ్యర్థిగా చందాపూర్ గ్రామానికి చెందిన ఎరుకలి మహాదేవప్ప పోటీ చేశారు. కానీ ఎన్నికకు ఒక రోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఫిబ్రవరి 11న జరగాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. తిరిగి మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో ఎన్నికల నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప భార్య సత్తెమ్మ బీజేపీ నుంచి ఆరో వార్డు మున్సిపల్ అభ్యర్థిగా పోటీలో నిలిచింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి బీరకాయలు మారెప్ప, బీఆర్ఎస్ నుంచి మొగులప్ప ఎన్నికల బరిలో ఉన్నారు.