న్యూఢిల్లీ: అన్ని రకాల బ్లడ్ గ్రూపుల వారికి ఉపయోగపడే గోల్డెన్ బ్లడ్‌ను ప్రయోగశాలల్లో తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే అత్యవసర సమయాల్లో మానవుల ప్రాణాలను కాపాడటం సాధ్యమవుతుంది. మానవుల బ్లడ్ గ్రూపుల్లో ప్రత్యేకమైనది ఆర్‌హెచ్-నల్. దీని రంగు బంగారు వర్ణంలో ఉంటుంది. అందుకే దీనిని గోల్డెన్ బ్లడ్ అంటారు. ఈ రక్తం 60 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ఈ రక్తాన్ని బ్లడ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా, అన్ని రకాల బ్లడ్ గ్రూపుల వారికి ఇవ్వవచ్చు. దీనిని ఇవ్వడం వల్ల రిజెక్షన్ రియాక్షన్ రాదు. ఈ బ్లడ్ గ్రూపుగల వ్యక్తులు తరచూ తమ రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు. దానిని బ్లడ్ బ్యాంకుల్లో భద్రపరుస్తారు.