BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
BRS | జిల్లాలోని పీఏ పల్లి మండలం నక్కలపెంట తండాకు చెందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులతోపాటు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
చందంపేట, ( దేవరకొండ ) : జిల్లాలోని పీఏ పల్లి మండలం నక్కలపెంట తండాకు చెందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులతోపాటు, పలువురు కాంగ్రెస్ ( Congress ) పార్టీ నాయకులు బిఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరారు. దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ( Ravindra Kumar ) వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని రవీంద్ర కుమార్ గుర్తుచేశారు.
పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ అంగోతు మునియా, వార్డు సభ్యులు కేతావత్ హరియా, మేగావత్ కిషన్, కేతావత్ మంగ్తా, ముడావత్ బాలా, మేగావత్ హనుము బావాజీ, మేగావత్ కృష్ణ, కేతావత్ సంతోష్, జాతవత్ రాజా, జాతవత్ నాగేష్, కేతావత్ కుమార్, ఆమ్ గోతు రమేష్, ముడావత్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, సర్పంచులు కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, రైనబోయిన శ్రీను, ఆడెపు నగేష్, రమావత్ కిషన్, అర్వపల్లి నర్సింహ, తోటకూరి పరమేష్, బొడ్డుపల్లి మహేందర్, రమావత్ శ్రీను, రమావత్ దామోదర్, అనిల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

