Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Dragon | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి ఉన్న గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర తీరు, ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగులు అభిమానులను ఆకట్టుకున్నాయి
Dragon | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి ఉన్న గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర తీరు, ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగులు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘డ్రాగన్’ చిత్రానికి ఇప్పటికే సంగీత దర్శకుడు రవి బసూర్ పనిచేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా మరో సంగీత దర్శకుడు శశ్వత్ సచ్దేవ్ పేరు తెరపైకి రావడంతో కొత్త చర్చ మొదలైంది. రవి బసూర్ స్థానంలో శశ్వత్ సచ్దేవ్ను తీసుకుంటున్నారా? లేక ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పనిచేయబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ ఇద్దరూ ఈ సినిమాకు సంగీతం అందిస్తే ప్రేక్షకులకు సరికొత్త సంగీత అనుభూతి లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రవి బసూర్ మాస్ నేపథ్య సంగీతం, శశ్వత్ సచ్దేవ్ విభిన్నమైన సంగీత శైలి కలిస్తే తెరపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు నేపథ్య సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా చూపించడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ‘డ్రాగన్’ కథలోనూ భావోద్వేగాలు, యాక్షన్ ప్రధానంగా ఉండనున్నాయనే ప్రచారం నేపథ్యంలో సంగీతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్.
1967 నాటి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితుల నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ వరకు సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యానికి తగ్గట్టుగా సంగీతం, నేపథ్య స్వరాలు ఉండటం చాలా ముఖ్యమని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వార్ 2’తో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఎన్టీఆర్.. ‘డ్రాగన్’తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రవి బసూర్, శశ్వత్ సచ్దేవ్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారా? లేక సంగీత దర్శకుడి విషయంలో మార్పు జరిగిందా? అనే అంశాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

