Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
Nallagonda | విద్యార్థుల భవిష్యత్తుతో పాఠశాల యాజమాన్యాలు ఆటలాడుతున్నాయి. పరీక్ష నిర్వహిస్తామని ముందుగానే ఫీజులు వసూలు చేసి, హాల్‌టికెట్లు జారీ చేసి, తీరా పరీక్ష కేంద్రానికి వచ్చిన తర్వాత పరీక్ష రద్దు చేయడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
రామగిరి : విద్యార్థుల భవిష్యత్తుతో పాఠశాల యాజమాన్యాలు ఆటలాడుతున్నాయి. పరీక్ష నిర్వహిస్తామని ముందుగానే ఫీజులు వసూలు చేసి, హాల్‌టికెట్లు జారీ చేసి, తీరా పరీక్ష కేంద్రానికి వచ్చిన తర్వాత పరీక్ష రద్దు చేయడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ ( Nallagonda) పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్ ( Sri Chaitanya School ) ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో స్కోర్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఇందుకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి, హాల్‌టికెట్లు కూడా జారీ చేశారు. పరీక్షకు సిద్ధమై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే పరీక్ష నిర్వహణకు అవసరమైన ఎలాంటి ఏర్పాట్లు కనిపించకపోవడంతో పాటు, పరీక్ష రద్దయిందని పాఠశాల సిబ్బంది చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా, పరీక్ష కేంద్రానికి వచ్చిన తర్వాత రద్దు విషయాన్ని తెలియజేయడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తరలివచ్చిన తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగినా, ప్రిన్సిపాల్ గానీ, యాజమాన్య ప్రతినిధులు గానీ సరైన వివరణ ఇవ్వకపోవడం మరింత ఆవేదనకు గురిచేసింది. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు బాధ్యతాయుతమైన సేవలు అందించాల్సిన విద్యాసంస్థలు ఇలాంటి వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పరీక్ష రద్దుకు గల కారణాలను యాజమాన్యం వెంటనే వెల్లడించి, విద్యార్థులకు న్యాయం చేయాలని, ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

