UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
UDP chief Metbah Lyngdoh | మేఘాలయ రాజకీయాల్లో ‘కింగ్‌మేకర్’గా వ్యవహరించిన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) ప్రస్తుతం తీవ్రమైన ఉనికి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది బీజేపీ, ఎన్పీపీలో చేరారు. దీంతో మిగిలిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే, యూడీపీ అధ్యక్షుడైన మెత్బా లింగ్డో శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
షిల్లాంగ్: మేఘాలయ రాజకీయాల్లో ‘కింగ్‌మేకర్’గా వ్యవహరించిన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) ప్రస్తుతం తీవ్రమైన ఉనికి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది బీజేపీ, ఎన్పీపీలో చేరారు. దీంతో మిగిలిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే, యూడీపీ అధ్యక్షుడైన మెత్బా లింగ్డో శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం కాన్రాడ్ కె. సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) ప్రభుత్వంలో ఏడాదికి పైగా మంత్రిగా ఆయన పనిచేశారు. మేఘాలయ అసెంబ్లీకి మాజీ స్పీకర్‌గా కూడా పనిచేసిన మెత్బా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మారినందునే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, యూడీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఆ పార్టీలో మిగిలిన ఏకైక ఎమ్మెల్యేగా నేను మాత్రమే ఉన్నాను. ఈ పరిస్థితుల్లో ఎండీఏ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం సాధ్యం కాదని భావించి, ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మాకు నా రాజీనామాను సమర్పించా. నా రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుంది. ఇది పార్టీ తీసుకున్న మొదటి నిర్ణయం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు ఉంటాయి’ అని ఆయన అన్నారు.
కాగా, 2023లో జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీపీ 12 స్థానాలను గెలుచుకున్నది. ఖాసీ-జైంతియా హిల్స్ ప్రాంతంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మూడేళ్లు తిరగకముందే ఆ పార్టీ నుంచి శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో నిష్క్రమించారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగా, మరో ముగ్గురు ఎన్పీపీలో చేరారు.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో యూడీపీ నుంచి కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలి ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడైన మెత్బా లింగ్డో, మంత్రిగా కొనసాగడం సరికాదని భావించారు. ఈ నేపథ్యంలో శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ తీసుకోబోయే మరికొన్ని నిర్ణయాలకు ఇది నాంది కానున్నదని ఆయన సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Chief
- conrad sangma
- join
RELATED ARTICLES
తాజా వార్తలు
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

