సంబురపడ్డ మహిళాలోకం
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించిన కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం విజయవంతమైంది. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళాలోకాన్ని సముచితంగా సత్కరించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఇచ్చిన పిలుపును పార్టీ శ్రేణులు విజయవంతం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాల్లోని మహిళా ప్రతిభావంతులను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన తమను టీఆర్ఎస్ అక్కున చేర్చుకొన్నదని లబ్ధిదారులు సంబురపడ్డారు.