పక్కా మాస్ సర్కారు
మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. మే 2న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మహేష్‌బాబు యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నది.
‘మునుపెన్నడూ చూడని విధంగా మహేష్‌బాబును మాస్ పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. త్వరలో నాల్గవ పాటను రిలీజ్ చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. చట్టంలోని లొసుగుల్ని అడ్టుపెట్టుకొని బడా బాబులు చేసే బ్యాంకు మోసాలు, రైతులు పడే ఇబ్బందుల్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

