నా మాట ఎవరూ వినట్లే .. నేనేం చేయాలి?
రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రె స్ ఎమ్మెల్యేలు, నేతల మధ్య వివాదాలు ముదిరాయి.
- ఏఐసీసీకి మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖ
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రె స్ ఎమ్మెల్యేలు, నేతల మధ్య వివాదాలు ముదిరాయి. పార్టీలో కొంతకాలంగా నేతల మధ్య జరుగుతున్న పంచాయితీలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేతులెత్తేశారు. ‘నా మాట ఎవరూ వినడం లేదు. నేనేం చేయాలి? తప్పుచేసిన వారిని వివరణ కోరితే, ‘నీ కంటే మేము సీనియర్లమ’ని లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారు. ఇలా ఉంటే పనిచేయడం కష్టం. గొడవలను మీరే పరిష్కరించండి’ అంటూ శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖ రాశారు.
ఇటీవల ఢిల్లీ వేదికగా సీడబ్ల్యూసీ సభ్యులు, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య నెలకొన్న వివాదంపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో కలుగజేసుకొనే ప్రయత్నం చేయగా, వారిద్దరూ తనను లక్ష్యపెట్టకపోవడంపై మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర ఆవేదన చెందినట్టు సమాచారం. మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్మీకాంతారావు మధ్య వివాదంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని కూడా హైకమాండ్‌కు ప్రత్యేకంగా వివరించినట్టు తెలిసింది. పెద్దపల్లి పరిణామాలపై కూడా లేఖలో అధిష్ఠానానికి వివరించినట్టు తెలిసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

