‘సింధు’లో నిరుపేదలకు ప్రపంచ స్థాయి వైద్యం
నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యుడు, హెటెరో గ్రూప్, సింధు హా స్పిటల్ చైర్మన్ బండి పార్థసారథిరెడ్డి ఏ ర్పాటు చేసిన దవాఖాన సేవలు అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యు డు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొ నియాడారు.
- మంత్రి తుమ్మల, ఎంపీ వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య
- దవాఖాన నిర్మాణంలో కేసీఆర్ప్రోత్సాహం : ఎంపీ పార్థసారథి
వేంసూరు, నవంబర్ 6 : నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యుడు, హెటెరో గ్రూప్, సింధు హా స్పిటల్ చైర్మన్ బండి పార్థసారథిరెడ్డి ఏ ర్పాటు చేసిన దవాఖాన సేవలు అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యు డు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొ నియాడారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ రథం(బస్సు) అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని తెలిపారు.
ఖమ్మం జిల్లా వేంసూ రు మండలం కందుకూరు ప్రజలకు శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించగా.. వెయ్యి మందిని పరీక్షించి అవసరమైన వారిని సింధు హాస్పటల్‌కు రిఫర్ చేశారు. తుమ్మల మాట్లాడుతూ సింధు హాస్పిటల్ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి వైద్య సేవల కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. సింధు హాస్పిటల్ నిర్మాణానికి కేసీఆర్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని గుర్తు చేశారు. వద్దిరాజు మాట్లాడుతూ.. ప్రత్యేక స్క్రీనింగ్ బస్సును ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

