శామీర్పేట, సెప్టెంబర్ 3: ప్రతిభకు పేదరికం, అంగవైకల్యం అడ్డు కాదంటూ క్రీడారంగంలో దూసుకెళ్తున్న దీరావత్ మహేశ్.. భారత పారా బీచ్ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యాడు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్ తాండకు చెందిన మహేష్ చిన్నతనంలోనే చేతిని కోల్పోయినా.. క్రీడా రంగంలో ఆకట్టుకుంటున్నాడు. ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న చాంపియన్షిప్లో పాల్గొనాల్సి ఉండగా.. అందుకు అయ్యే ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక దాతల కోసం ఎదురుచూస్తున్నాడు.