సినీ హీరో మహేశ్‌బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్టు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరైనా ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే వేయించుకోవాలని మహేశ్‌బాబు కోరారు.