Mahesh babu |సినీ ఇండస్ట్రీకి వారసుల రాక కొత్తేమి కాదు. ఇక ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై RX 100, మంగళవరం లాంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ డెబ్యూ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా కథ, ప్రాజెక్టు ని మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షించారని టాలీవుడ్ టాక్. బాబాయ్ అండతో అబ్బాయి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా, ఈ సినిమా పెద్ద విజయం సాధించడం ఖాయం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సారా అర్జున్ను అనుకుంటున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జయకృష్ణ ఫోటో షూట్ కూడా పూర్తైందని టాక్. ఈ భారీ లాంచ్‌కి రంగం సిద్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించనుండడంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అజయ్ భూపతి RX 100, మంగళవారం వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు జయకృష్ణ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సినిమాని రూపొందించనున్నాడు. ఈ యువ నటుడి తొలి సినిమా కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జయకృష్ణ ప్రస్తుతం లండన్‌లో ప్రొఫెషనల్ నటన శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ లాంచ్‌ను మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సరైన ప్లానింగ్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో జయకృష్ణని భారీ స్థాయిలో పరిచయం చేయాలని మహేష్ ఆకాంక్షిస్తున్నాడట. కాగా, మూడేళ్ళ క్రితం మహేష్ అన్న రమేష్ బాబు మరణించగా, అప్పట్నుంచే రమేష్ తనయుడు జయకృష్ణని మహేష్ హీరో చేయబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.