ఆలేరు రూరల్, మార్చి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పల్లె ప్రగతితో ఇప్పటికే పట్టణస్థాయి వసతులు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నది. ఆలేరు మండలంలోని 14 గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద రూ.60 లక్షలు, ఎస్డీఎఫ్ నిధులు రూ.3.24 కోట్లు మంజూరు కాగా, వాటితో చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధుల నుంచి గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేయడంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. త్వరలోనే పనులు పూర్తవుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-వంగాల శ్రీశైలం, సర్పంచ్, తూర్పుగూడెం
గతంలో అంతర్గత రహదారులు లేక వానకాలం వీధులన్నీ బురదమయంగా మారేవి. వీధుల్లో నడవాలంటేనే ఇబ్బందిగా ఉండేది. ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించడం అభినందనీయం. సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డికి ధన్యవాదాలు.
-కంతి మహేందర్, ఉప సర్పంచ్, శారాజీపేట