Corona Cases in Maharastra | మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబెడుతున్నది. గురువారం వరుసగా రెండో రోజు కొవిడ్-19 పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి. గురువారం 1045 మందికి కరోనా సోకిందని, ఒకరు మరణించారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 4,559గా ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసులు 78,89,212 నమోదు కాగా, 1,47,861 మంది మరణించారు.
బుధవారం మహారాష్ట్రలో 1081 కొత్త కేసులు రికార్డయ్యాయి. గత ఫిబ్రవరి 24 నుంచి రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గురువారం కేవలం ముంబైలోనే 704 కొత్త కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. గత 24 గంటల్లో 517 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీ అయిన రోగుల సంఖ్య 77,36,792కి చేరింది.
మొత్తం కేసుల రికవరీ 98.07 శాతానికి చేరుకున్నది. రాష్ట్రంలో మరణాల రేటు 1.78 శాతంగా ఉంది. జల్నా, లాతూర్, పర్భానీ, బుల్దానా, గోండియా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.