షిర్డీ: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మరికొంత మంది భక్తులకు షిర్డీ సాయిబాబా దర్శనాన్ని కల్పించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి రోజు 10,000 మందికి ఆఫ్లైన్ పాసులు జారీ చేయనున్నట్టు తెలిపింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్లైన్ పాసుల విధానం యథావిధిగా కొనసాగుతుందని, ఈ పాసుల ద్వారా ప్రతి రోజు 15,000 మందికి దర్శనం కల్పిస్తామని ఆలయ యాజమాన్యం తెలిపింది.