
ఊట్కూర్, అక్టోబర్ 31 : స మాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నే రాలకు పాల్పడరని జూనియర్ సివిల్ జడ్జి ఎం.రాజేశ్వర్ సూ చించారు. ఆదివారం ఊట్కూర్, తిప్రాస్‌పల్లి, కొల్లూరు, మల్లేపల్లి, సంస్థాపూర్ తదితర గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సివిల్ జడ్జి హాజరై చట్టాల గురించి ప్రజలకు వివరించా రు. సంస్థాపూర్ గ్రామస్తులు ఇప్పటి వరకు కోర్టు మెట్లు ఎక్కలేదని, పోలీస్‌స్టేషన్‌లో ఏ ఒక్క కేసు కూ డా నమోదు కాకపోగా గ్రామస్తులందరూ కలిసిమెలిసి జీవనం చేయడంపై ఆనందం వ్యక్తం చే స్తూ ప్రజలను అభినందించారు. మల్లేపల్లిలో అధి క శాతం ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన కేసులే నమోదవుతున్నాయని, చట్టపరంగా అనుమతులు పొంది వాగుల నుంచి ఇసుకను తరలించాల్సి ఉంటుందని సూచించారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల ధరలు పెరుగుతున్నాయని, సా దాబైనాపై ఆస్తులు కొనుగోలు చేస్తే అవి చెల్లనేరవని చిత్తు కాగితాలతో సమానమవుతాయన్నారు. రూ.100 కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తులను ధరణి పోర్టల్‌తో లింకు డాక్యుమెంట్ రాయించుకొని డబ్బులను చెక్కులు, అకౌంట్ రూపేన చెల్లించాలన్నారు.
ఎస్సై పర్వతాలు, న్యాయవాదులు భీంరెడ్డి, న ర్సింహులు, లక్ష్మీపతిగౌడ్ మాట్లాడుతూ వాహన యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా వాహనాల ను రిజిస్ట్రేషన్ చేయించుకొని విధిగా లైసెన్సులు పొందాలని తెలిపారు. తాగి వాహనాలను నడిపితే జరిమానాతోపాటు, కేసులు కూడా నమోదవుతాయన్నారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, మాణిక్యమ్మ, ఎస్సై సురేందర్, ఉపసర్పంచ్ బాలస్వామి పాల్గొన్నారు.