మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా అద్భుతమైన ప్రగతి సాధిచబోతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ అయిందన్నారు. దీంతో మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్ పూర్ కలిసి పెద్ద నగరంగా ఏర్పాటు కాబోతున్నదని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ కు HMDA వల్లే మంచి రూపం వచ్చింది. అభివృద్ధి సాధ్యమైందన్నారు.

మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూరు కలిసి విస్తారంగా అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తుందని మంత్రి తెలిపారు. ఉదండాపూర్, కర్వెన రిజర్వాయర్లు మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఉన్నాయిమన్యం కొండ గుట్టల్లో కూడా ఒక రిజర్వాయర్ వస్తుందన్నారు.
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందని మంత్రి తెలిపారు. జాతీయ పార్టీ నాయకులు సభ్యత సంస్కారంతో మాట్లాడాలి.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.