నారాయణపేట టౌన్, మార్చి 19 : మహిళలు అన్ని రం గాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చే యడంతోపాటు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా రుణాలు అందించి వారిని వ్యాపార పరం గా ప్రోత్సాహిస్తున్నది. అందులో భాగంగా మహిళా సంఘా ల సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రభుత్వం అందించే స్త్రీని ధి రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్త్రీనిధి రుణాలతో మహిళలు వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రుణాలు పొందిన మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలువడంతోపాటు ఇతర మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. కేవలం వ్యాపార నిర్వహణ కోసం కాకుండా కుటుంబ అవసరాలకు రుణాలు అందజేస్తున్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు, ఆ రోగ్య అవసరాల నిమిత్తం కూడా రుణాలను ఇస్తున్నారు.
రూ.25కోట్ల55లక్షల రుణాలు అందజేత
జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. అందులో మొత్తం 162 గ్రామైక్య సంఘాలు, 3194 స్వయం సహాయక సం ఘాలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాలో రూ.31కోట్ల43లక్షల రుణాలను స్త్రీనిధి ద్వారా అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఇ ప్పటి వరకు రూ.25కోట55లక్షల రుణాలను అధికారులు పంపిణీ చేసి 79.81శాతం రుణ లక్ష్యాన్ని చేరుకున్నారు. పేట మండలంలో రూ.4కోట్ల37లక్షల రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా రూ.2కోట్ల49లక్షల రుణాలు అందజేశారు.
ఊట్కూర్ మండలంలో రూ.3కోట్ల17లక్షలకు గా నూ రూ.3కోట్ల8లక్షలు ఇచ్చారు. నర్వ మండలంలో రూ.2 కోట్ల23లక్షలకుగానూ రూ.1కోటి62లక్షలు, మరికల్ మం డలంలో రూ.2కోట్ల58లక్షలకుగానూ రూ.2కోట్ల92లక్షలు, మక్తల్ మండలంలో రూ.3కోట్ల80లక్షలకుగానూ రూ.2కోట51లక్షలు, మాగనూర్ మండలంలో రూ.1కోటి68లక్షలకు గానూ రూ.1కోటి19లక్షలు, మద్దూర్ మండలంలో రూ.2కోట్ల4లక్షలకుగానూ రూ.2కోటి6లక్షలు, కృష్ణ మండలంలో రూ.1కోటి75లక్షలకు గానూ రూ.1కోటి15లక్షలు, కోస్గి మండలంలో రూ.3కోట్ల87లక్షలకుగానూ రూ.2కోట్ల81లక్షలు, ధన్వాడ మండలంలో రూ.1కోటి45లక్షలకు గానూ రూ.1కోటి26లక్షల రుణాలు అందజేశారు. రాబో యే 12 రోజుల్లో ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అయితే గతేడాది రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని గ్రామాలకు ఈసారి స్త్రీనిధి రుణాలు ఇవ్వలేదు. దీంతో రుణ లక్ష్యం చేరుకోవడంలో కొంత జాప్యం ఏర్పడినట్లుగా తెలుస్తున్నది.
నెలాఖరులోగా లక్ష్యం చేరుకుంటాం..
ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన రుణ లక్ష్యాన్ని నెలాఖరులోగా చేరుకునేలా చర్యలు తీసుకుంటు న్నాం. అందుకు గానూ క్షేత్రస్థాయిలో సిబ్బంది కృషి చేస్తున్నారు. స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియో గం చేసుకోవడంతోపాటు నిర్ణీత సమయంలోగా చెల్లించాలి. సకాలంలో చెల్లించనట్లయితే కొత్త రుణాలు పొందేందుకు ఆస్కారం ఉండదు.
-తిరుపతయ్య, స్త్రీనిధి జిల్లా మేనేజర్
రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారు..
స్త్రీనిధి ద్వారా రుణాలు అందుకున్న మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు రుణాలు తీసుకొని వ్యాపారంలో రాణిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. స్త్రీనిధి ద్వారా పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మండలంలోని అభంగాపూర్, పేరపళ్ల, గనిమోనిబండ, శ్యాసన్పల్లి, పేరపళ్ల, కోటకొండ, భైరంకొండ, అయ్యవారిపల్లి తదితర గ్రామాలకు ఈసారి స్త్రీనిధి రుణాలు ఇవ్వలేదు. నెలాఖరులోగా ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేస్తున్నాం.
-శకుంతల, ఏపీఎం