నాగర్‌కర్నూల్, మార్చి 19 (నమస్తే తెలంగా ణ) : మార్కెట్ కమిటీల పదవీ కాలాన్ని ప్రభు త్వం రెండేండ్లకు పొడిగించింది. ప్రస్తుతం ఒక సంవత్సరం వరకు మాత్రమే కమిటీలకు కాల పరిమితిగా ఉండగా.. ఇకపై రెండేండ్లకు పెం చింది. అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పించేందుకు కమిటీ చైర్మన్లు, కార్యవర్గానికి రిజర్వేషన్లను కేటాయించింది. కాగా, ఒక సంవత్సరం గ డువుతో ఈ మూడేండ్లలో రెండు కమిటీలు ని యామకమయ్యాయి. మార్కెట్ కమిటీల ద్వారా రైతుల ధాన్యం, పంటలు కొనుగోళ్లు చేస్తున్నది. పుష్కలంగా సాగునీరు ఉండడంతో వ్యవసా యం జోరందుకున్నది. దీంతో కమిటీల ద్వారా కొనుగోళ్లు ప్రతి సీజన్లో ఆశించినదానికంటే అధికంగా ఉన్నది. అలాగే ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో నూతన నిర్మాణాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో పనుల కొనసాగింపునకు కమిటీల గడువును కొన్ని చోట్ల మరో ఆరు నెలలపాటు కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నది. అయితే, ఇది ప్రతిసారీ చేసేందుకు వీలు కావడం లేదు. ఈ క్రమం లో ఆశించిన స్థాయిలో పాలకవర్గాలు పని చే సేందుకు ప్రభుత్వం రెండేండ్లపాటు మార్కెట్ కమిటీల పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో ఇ టీవల తీర్మానించింది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన బిల్లును సభ ఆమోదించింది. ప్రస్తుతం ఆరు నెలలు, ఏడాది పూర్తి చేసుకున్న కమిటీలకు మిగతా సమయం వర్తించనున్నది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. అలాగే కమిటీలో 14 మంది సభ్యుల సంఖ్యకు అదనంగా మరో నలుగురు రానున్నారు. దీంతో కమిటీలో ఇకపై 18 మంది సభ్యు లు ఉండనున్నారు. కొత్త సభ్యులను ప్రభుత్వ ఉత్తర్వులు వ చ్చాక నియమించనున్నారు.
ఇందులో రైతులకు అధిక ప్రాధాన్యత కల్పించనున్నా రు. ఇప్పటివరకు 8 మంది వరకు రైతులు ఉండాల్సి ఉండ గా.. ఇకపై 12 మందికి పెరగనున్నారు. మార్కెట్ కమిటీలంటే రైతులే అన్నట్లుగా ప్రభుత్వం కొత్త నిర్ణయం ప్రకారం స్పష్టమవుతున్నది. కేంద్రం నిర్ణయంతో మార్కెట్ కమిటీలకు ఆదాయం నిలిచిపోవడంతోపాటు ప్రాధాన్యత కొరవడింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలను బలోపేతం చేసేందుకే చర్యలు చేపడుతున్నది. ధాన్యం కొనుగోళ్లను సైతం చేపట్టేందుకు నిర్ణయించింది. దీంతో స్థానికంగా రైతులతో సంబంధాలున్న కమిటీలు దళారులకు ధాన్యం తరలకుండా ప్రభుత్వానికే విక్రయించేలా కృషి చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంపై పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
మార్కెట్ కమిటీల పదవీకాలాన్ని రెండేండ్లపాటు పొడిగించడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రికి కృతజ్ఞతలు. తమ పదవి ఏడాది మాత్రమే ఉండడడంతో ఆశించినంతగా పని చేయడానికి సమయం సరిపోవడం లేదు. రెండేండ్ల పొడిగింపుతో మార్కెట్ యార్డుల్లో సీసీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతుంది.
– కుర్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్
త్వరలో ఉత్తర్వులు..
మార్కెట్ కమిటీల పదవీకాలాన్ని రెండేండ్లపాటు పొడిగించేందుకు ఇటీవల శాసనసభలో తీర్మానం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి. దాని ప్రకారం పాలకవర్గానికి సమాచారం అందజేస్తాం. అలాగే కొత్తగా సభ్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటాం.
– బాలమణెమ్మ, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారిణి, నాగర్‌కర్నూల్