నాగర్కర్నూల్ జిల్లాలో 254 స్కూళ్లల్లో ఆంగ్ల మాధ్యమం
22 వేల మంది విద్యార్థుల విద్యాభ్యాసం
ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారే అధికం
నాగర్కర్నూల్, మార్చి 19 : విద్యార్థి బంగారు భవితకు ఆంగ్ల మాధ్యమం పునాదిలాంటిది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ మీడియంలో చదవుకోవాల్సిన అవసరమూ ఉంది. నేటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలవాలంటే బాగా రాణించాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడుల్లో ఆంగ్ల బోధనకు చర్యలు తీసుకుంటున్నది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి బడిలో 1 నుంచి 8వ తరగతి వరకు తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని కూడా అమలు చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నది. ఇప్పటికే కొన్ని స్కూళ్లల్లో ఆంగ్ల బోధన ఉండగా.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో విద్యార్థుల సం ఖ్య గణనీయంగా పెరగనున్నది. ఇంగ్లిష్ మీడియంతో ప్రైవేటు స్కూళ్లల్లో ఫీ‘జులుం’ పోవడంతోపా టు విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మళ్లనున్నారు.
ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి..
నాగర్కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకుగానూ 11 మండలాల్లో ఆంగ్ల మాధ్యమం చదువుతున్న విద్యార్థులే ఎక్కువ. సమస్యల లోగిళ్లు తొలగనున్నాయి. ‘మన ఊరుమన బస్తీ- మన బడి’ కార్యక్రమంతో బడు ల్లో మౌలిక వసతులు పెరగనున్నాయి. ఇంగ్లిష్ మీడియానికి అనుగుణంగా వనరులు ఏర్పాటు కానున్నాయి.
254 పాఠశాలలు.. 22,187 మంది విద్యార్థులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఇంగ్లిష్ మీడియం కొనసాగించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలోని తాడూరు మండలంలో 37 పాఠశాలలు ఉండగా, 34 పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నది. కేవలం 3 పాఠశాలల్లోనే తెలుగు మీడియం ఉన్నది. నాగర్కర్నూల్ మండలంలో 59 పాఠశాలలు ఉండగా 28 పాఠశాలల్లో ఆంగ్ల మా ధ్యమం కొనసాగుతున్నది. వెల్దండ, కోడేరు, కొల్లాపూ ర్, పెండ్లవెల్లి, వంగూరు, ఊర్కొండ, కల్వకుర్తి, చారగొండ, అచ్చంపేట మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల ల్లో చదువుతున్న విద్యార్థుల్లో 40 శాతానికిపైగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులే.. నాగర్కర్నూల్, తాడూరు మం డలాల్లోనే 6,637 మంది విద్యార్థులు చదువుతున్నారంటే ఆంగ్ల మాధ్యమానికి ఉన్న ప్రాధాన్యం గుర్తించొ చ్చు. 825 ప్రభుత్వ పాఠశాలల్లో 71,079 మంది తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో విద్యాభ్యాసం చే స్తుంటే.. 254 పాఠశాలల్లో 22,187 మంది విద్యార్థు లు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లోని పాఠశాలల్లో 40 శాతం ఇంగ్లీష్ మీ డియం అమలవుతోంది. 2008 నుంచి 55 ఉన్నత పా ఠశాలలు సక్సెస్ స్కూళ్లుగా పనిచేస్తున్నాయి.