మక్తల్ రూరల్, మార్చి 15 : నియోజకవర్గ పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఫిష్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్, జూరాల ప్రాజెక్టు కింద రామన్‌పాడ్ నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే వానకాలం సీజన్లో మత్స్య కార్మికులకు ఫిష్ సీడ్‌ను సరఫరా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇదివరకు ఈ విషయంపై మంత్రి దృష్టికి తీసుకొచ్చానన్నారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విషయాన్ని నోట్ చేసుకున్నానని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, త్వరలో ఫిష్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుటుంన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
‘సమస్యలు పరిష్కరిస్తాం’
మాగనూర్, మార్చి 15 : త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నేరడగం గ్రామం చిట్టెం నర్సిరెడ్డి బ్యాల్యెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామంగా ప్రకటించి జీవో విడుదలైనా నేటి కీ పూనరావాసం కల్పించకపోవడంతో ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సహకారం తో సర్పంచ్ అశోక్‌గౌడ్, ఎంపీటీసీ ఎల్లారెడ్డి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నగరంలోని నివాసంలో మంగళవారం కలిసి గ్రామ సమస్య లు వివరించారు. సమస్యలు విన మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇ చ్చారని వారు తెలిపారు. అనంతరం సిద్ధలింగేశ్వరస్వామి ఉత్సవాలకు మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేసి తప్పకుండా రావాలని కోరడంతో వస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పే ట ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక
మండలంలోని నేరడగం పశ్చిమాద్రి సంస్థాన విరక్తమ ఠం పీఠాధిపతి పంచమ సిద్ధ్దలింగ మహాస్వామి మహోత్స వ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి పంచమ సిద్ధలింగ మహాస్వామి మంగళవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. తప్పకుండా మహోత్సవానికి రావాలని కోరారు. దేవస్థానం అభివృద్ధి గురించి ఎమ్మెల్యేకు వివరించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ వెంకటయ్య, ఈశ్వర్‌యాదవ్ పాల్గొన్నారు.