మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 3 : టీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. మండలంలోని రాచాల చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ చేశారు. కల్యాణమండపం నిర్మాణానికి ముందుకొచ్చిన గౌని చెన్నారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అడ్డాకులకు చెందిన శివయాదవ్‌కు రూ.60వేలు, కందూరుకు చెందిన మహ్మద్హుస్సేన్కు రూ.58వేలు, గుడిబండ గ్రామవాసి ఆంజనేయులుకు రూ.36వేలు, రాచాలకు చెందిన సీహెచ్ అనిల్‌కుమార్‌కు రూ.18వేలు, పొన్నకల్ గ్రామవాసి అంజన్నకు రూ.32వేలు సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఆల తెలిపారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమ లు చేస్తూ అండగా నిలిచారన్నారు. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ దోనూరు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్, తిరుపతయ్య, భాస్కర్నాయడు, రవీందర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.