నారాయణపేట రూరల్, జూన్ 15 : ప్ర భుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు మెరుగైన విద్యకు ప్రాధాన్యం ఇ వ్వాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని భైరంకొండ ప్రా థమికోన్నత పాఠశాల, జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, పరిమళపూర్ ప్రా థమిక పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మం డలంలో ఎంపికైన పాఠశాలల పనులను ఈనెల 30 వ తేదీ లోగా పూర్తి చేయాలని ఇంజీనీర్లు, సర్పంచులను ఆదేశించారు. భైరంకొండలో పాఠశాలకు కావలసిన ప్రహరీని పంచాయతీ నుంచి నిర్మించుకోవాలన్నారు. పాఠశాలకు మిషన్ భగీరథ నీటిని అందించాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేం ద్రం నుంచి పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులతో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగై న విద్యాబోధనతోపాటు, నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాల ను సందర్శించి రోల్ మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాల ని, అన్ని హంగులతో నిర్మించాలన్నారు. పరిమళాపూర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మధ్యా హ్న భోజనం ఏర్పాటు చేయకపోవడంపై హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు క లెక్టర్ చంద్రారెడ్డి, డీఈవో లియాఖత్ అలీ, ఏఎంవో విద్యాసాగర్, డిప్యూటీ ఇంజినీర్ రాము, సెక్టోరల్ అ ధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.