
గట్టు, అక్టోబర్ 30 : టీఆర్ఎస్ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించే ‘విజయగర్జన’ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రం లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. బీజే పీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. గర్జనకు మండల, గ్రామాల పార్టీ కార్యవర్గ సభ్యులతోపా టు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. జన సమీకరణలో సత్తాచాటాలన్నారు. సభకు వెళ్లడానికి అ వసరమయ్యే ఏర్పాట్లన్నీ జరుగుతాయ ని, దీనిపై పార్టీ శ్రేణులకు ఎలాంటి అనుమానాలు వద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశా రు. నిత్యావసర ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను లెక్కలేనన్ని సార్లు పెం చిన రికార్డు మోడీ సొంతం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హయాం లో అభివృద్ధి బాజాప్తగా జరుగుతున్నద ని, దీనిని సోషల్ మీడియా వేదికగా వి స్తృతంగా ప్రచారం చేయాలని యువత కు పిలుపునిచ్చారు. అంతకుముందు మండల పార్టీ కార్యవర్గ సభ్యులను ఎ మ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్, పీఏసీసీఎస్ చై ర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ సునీతమ్మ, జెడ్పీ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఇ మాంసాబ్, వాహబ్, నాయకులు హనుమంతు, రామన్‌గౌడ్, బస్వరాజు, ఆనంద్‌గౌడ్, రామాంజనేయులు, రామునాయుడు, హనుమంతురెడ్డి, సంతోష్, వెంకటేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్కు కార్యకర్తలే బలం..
మల్దకల్, అక్టోబర్ 30 : టీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్, కార్యకర్తలు బలమైన కంచుకోట అని ఎమ్మెల్యే బండ్ల అ న్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రైవేట్ భవనంలో పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన కమిటీలు బాధ్యత వహించి గర్జనకు అధిక సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి పు నాది వేసిన టీఆర్ఎస్కు అందరం రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో జె డ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకట న్న, వేంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ప్రహ్లాదరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ విష్ణు, యూత్ మండల అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
పేదలకు అండ.. గులాబీ జెండా
కేటీదొడ్డి, అక్టోబర్ 30 : పేదలకు అం డగా గులాబీ జెండా ఎప్పటికీ ఉంటుందని, అలాంటి టీఆర్ఎస్ పార్టీ 20 ఏం డ్ల పండుగకు అందరూ కదిలిరావాలని ఎమ్మెల్యే బండ్ల పిలుపునిచ్చారు. మండ ల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తల వి స్తృత స్థాయి సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ చరిత్ర.. దేశంలో ఏ పార్టీకి లేదని, ఒక్కడితో మొదలై ఇప్పుడు కోట్ల మం దితో నిలిచిందన్నారు. అలాంటి పార్టీ ద్విదశాబ్దం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో జె డ్పీటీసీ రాజశేఖర్, వైఎస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, మండల అధ్యక్షుడు ఉ రుకుందు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు హనుమంతు, యూత్ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడు మల్దకల్ సర్పంచు ల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు చక్రధర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, యుగేందర్‌గౌడ్, గోపి ఉన్నారు.