
భూత్పూర్, అక్టోబర్ 30 : మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం భూ త్పూర్ మున్సిపల్ కార్మికులు తమకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మెల్యే ఆలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్మికులకు త్వరలోనే వేతనాలు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆల రఘుపతిరెడ్డికి నివాళి
మండలంలోని అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తండ్రి, బ్లాక్ సమితి మాజీ అధ్యక్షుడు ఆల రఘుపతిరెడ్డి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల రఘుపతిరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆల పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నూరుల్‌నజీబ్, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, మనెమోని సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, ఆల శశివర్ధన్‌రెడ్డి, అశోక్‌గౌడ్, రాజారెడ్డి, చెన్నయ్య, షాకీర్ పాల్గొన్నారు.