
నవాబ్‌పేట, అక్టోబర్ 30 : బీసీలు సంఘటితం కావాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అ ధ్యక్షుడు ఎడ్ల బాలవర్ధన్‌గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. ప్రభు త్వం బీసీ గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశంలో 56శాతం జ నాభా ఉన్న బీసీలకు అంతే స్థాయిలో చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీసీ చైతన్యయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. 31న నవాబ్‌పేట, కొల్లూరు గ్రామాల్లో బీసీ చైతన్యయాత్రతోపా టు సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 8న జడ్చర్లలో నియోజకవర్గ స్థాయి బీసీ చైతన్య సదస్సు ఉంటుందని తెలిపారు. సదస్సుకు బీసీలు అధిక సంఖ్య లో హాజరై విజయవంతం చేయాలని కోరా రు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నా యకులు కర్నెకోట విజయ్‌భాస్కర్, నడిమిం టి శ్రీనివాస్, శ్రీను, జగన్, తిరుపతయ్య, ఖాజా, హుస్సేన్ తదితరులు ఉన్నారు.