
కోస్గి, అక్టోబర్ 30: సర్ధ్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజలకు ఆదర్శమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం పటేల్ జన్మదినం ఏక్తాదివస్ సందర్భంగా విద్యార్థులతో పాఠశాలలో ప్రతిజ్ఞ చేయించారు.
ఖాన్దొడ్డిలో..
కృష్ణ, అక్టోబర్ 30: మండలంలోని ఖాన్దొడ్డి ప్రాథమిక పాఠశాలలో శనివారం పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయలక్ష్మి, ఉపసర్పంచ్ అశోక్, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ మల్లికార్జున్, నాయకులు తిప్పయ్య, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రాఘవేంద్ర, శివరాజ్, అంగన్వాడీ టీచర్ అనిత, పాల్గొన్నారు.
మల్రెడ్డి పాఠశాలలో..
దామరగిద్ద, అక్టోబర్ 30: మండలంలోని మల్రెడ్డిపల్లి పాఠశాలలో సర్ధార్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీనివాస్, సీఆర్పీ మహిపాల్, ఉపాధ్యాయులు దిందప్ప, ఎల్లయ్య స్వామి, రామకృష్ణ పాల్గొన్నారు.
సమైక్యత ప్రతిజ్ఞ
నారాయణపేట రూరల్, అక్టోబర్30: సర్ధ్దార్ వల్లబాయి పటేల్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులు,ఉపాధ్యాయులు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. మండలంలోని జాజాపూర్, కొల్లంపల్లి, కోటకొండ, తిర్మలాపూర్ గ్రామాల్లోని పాఠశాలల్లో శనివారం రాష్ట్రీయ ఏక్తాదివస్ శనివారం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతిజ్ఞ
మరికల్, అక్టోబర్ 30: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఏక్తా దివస్ ఘనంగా జరుపుకొన్నారు. దేశ సమైక్యతకు పాటుపడుతామని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పటేల్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గాయత్రి, ఉపాధ్యాయులు బాల్లింగయ్య, నర్సింహయ్య, జగదీశ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.