
మహబూబ్‌నగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 20 ఏండ్లయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్‌లో ఏర్పాటు చేసిన విజయ గర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ప్రతి ఊరి నుంచి ఓ బస్సు కదలాలని.. నియోజకవర్గం నుంచి చీమలదండును తలపించేలా కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశా రు. దేవరదక్ర పట్టణంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో గర్జన సభకు సంబంధించి సన్నాహ క సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే రాష్ట్రంలో అత్యుత్తమంగా అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు మాత్రం చౌకబా రు విమర్శలకు దిగుతున్నాయన్నారు. విపక్షాలు ఒకటంటే.. మనం వంద సమాధానాలు చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేనొక్కడినే తప్పు చేశానా..? ఎవరూ చేయలే దా..? అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అ లాంటి వ్యక్తి ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే దుస్థితి రావడం శోచనీయమన్నారు. తెలంగాణ లో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్ వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడంలేదో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్షాలను నిలదీయాలని పేర్కొన్నా రు. వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని.. తాను అప్పుడు సీఎం కేసీఆర్‌తో కలిసి ఢి ల్లీ పర్యటనలో ఉన్నాన ని తెలిపారు. కానీ హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ వడ్ల కొనుగోలు మీద దొంగ దీక్షలు చేశాడని.. మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ స్వీకరించకుండానే పలాయనం చిత్తగించాడని ఎద్దే వా చేశారు. నియోజకవర్గంలో కోయిల్సాగ ర్, ఎంజీకేఎల్ఐ ద్వారా సాగు నీరు అందుతుందని, చెక్‌డ్యాంలతో బోర్లు, బావులు రీచార్జి అవుతున్నాయన్నారు. కరివెన రిజర్వాయర్‌తో ప్రతి గుంటకూ సాగునీరందుతుందన్నా రు. దేవరకద్రలో ఆర్వోబీ కోసం మూడేండ్లు తిరిగినా కేంద్రం పైసా ఇవ్వలేదని.. సీఎం కేసీఆర్ ఇ చ్చిన నిధులతో పనులు చేపట్టామన్నారు. 2001 నుంచి 2021 వరకు టీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని కార్యకర్తలను కోరారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి కనీసం 10 వేలకు తగ్గకుండా కార్యకర్తలు తరలిరావాలని, ప్రతి గ్రామం నుంచి ఓ బస్సు వరంగల్
చేరుకోవాలన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నా యకులు, కార్యకర్తలు కేవలం బస్సుల్లోనే వరంగల్‌కు రావాలన్నారు. బస్సులోనే టిఫిన్ చేయాల ని, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఆలేరు-వరంగల్ మధ్యలో ఉన్న ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స కాలంలో వరంగల్ చేరుకొని కేసీఆర్, కేటీఆర్ ప్రసంగాలు త ప్పకుండా వినాలని కార్యకర్తలకు సూచించారు. కాగా, సమావేశానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 2 వేల మందిని మా త్రమే ఆహ్వానించినా.. సుమారు 7 వేల మందికి పైగా కార్యకర్తలు రావడంతో ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. అంతకుముందు పట్టణం లో ద్విచక్రవాహనాలతో నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంగీత, నా టకరంగ అకాడమి చైర్మన్ బాద్మి శివకుమార్, జె డ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, భూత్పూర్ ము న్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, జెడ్పీ వైస్‌చైర్మన్ వా మన్గౌడ్, ఎంపీపీలు శేఖర్‌రెడ్డి, రమాదేవి, హర్షవర్ధన్‌రెడ్డి, కళావతి, నాగార్జునరెడ్డి, మౌనిక, పద్మావతి, జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, అన్నపూర్ణ, రాజేశ్వరి, ఇంద్రయ్యసాగర్, కృష్ణయ్య, నాయకులు మహెమూద్, నారాయణగౌడ్, జెట్టి నర్సింహారెడ్డి, రాము, గోపిస్వామి తదితరులు పాల్గొన్నారు.