
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 29 : బల్దియాలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు వ్య ర్థాల నుంచి సంపదను సృష్టించే కార్యక్రమానికి మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. తోపుడుబండ్లు, ఇండ్ల నుం చి సేకరించిన వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేందుకు అడుగు పడింది. రీ సైక్లింగ్‌లో వేరు చేసిన వస్తువులను విక్రయించి ఆదాయం సమకూర్చనున్నారు. కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డులోని డంపింగ్‌యార్డులో సెగ్రిగేషన్ మిషన్ ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో నిత్యం 106 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. ఇండ్లు, రోడ్ల వెంబడి, దుకాణాల ద్వారా సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ మిషన్‌లో వేస్తారు. మిషన్ నడిచే క్రమంలో మొదటి దశలో ఇనుప వస్తువులు, రెండో దశలో తడి చెత్త, మూడో దశలో పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు.. చివరగా పాత చెప్పులు, లెదర్ వస్తువులు, దుస్తువులు వేరు చేయబడతాయి. వాటిని అవసరమైన కంపెనీలకు విక్రయిస్తారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువు, ప్లాస్టిక్ వేస్ట్‌తో ఇటుకలు తయారు చేయనున్నారు. వ్యర్థాలను వివిధ పరిశ్రమలకు విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చాలా తక్కువ మనుషులతో సెగ్రిగేషన్ మిషన్ ద్వారా వివిధ దశల్లో వ్యర్థాలను వేరుచేయనున్నారు. 90 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ఈ మిషన్‌తో ఏ రోజు చెత్త ఆ రోజే సంపదగా మార్చే అవకాశం ఉంటుంది. దీనిని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సెగ్రిగేషన్ మిషన్, డంపింగ్‌యార్డు ఏర్పాటు పనుల ప్రక్రియ వేగవంతం చే శారు. అలాగే చెత్త బరువును తెలుసుకునేందుకు వేయింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పనులను పర్యవేక్షిస్తున్నా రు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచనల మేరకు డంపింగ్‌యార్డులో మిషన్‌ను ఏర్పాటు చే స్తున్నామని, ఇప్పటికే మిషన్ భాగాలు డంపింగ్‌యార్డులోకి వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. త్వరలోనే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నా రు.