
ఉండవెల్లి, అక్టోబర్ 29 : వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న విజయగర్జన సభకు నియోజకవర్గం నుంచి 164 బస్సులు సిద్ధంగా ఉంచినట్లు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. మండలంలోని అలంపూర్ చౌరస్తాలోని ఫంక్షన్హాల్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎంపీ మంద జగన్నాథంతో కలిసి ఎమ్మెల్యే అబ్రహం ప్రొఫెసర్ జయశంర్ సార్ చిత్రపటానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో విలీనం చేయలని అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని చూసి ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వచ్చే రెండు దశాబ్దాలపాటు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉండి ప్రజా సంక్షేమ పాలన సాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ విజయగర్జన సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి, తండాకు ఒక బస్సు వస్తుందని, అందులోనే ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లాలన్నారు. నాయకులు, కార్యకర్తల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
కార్యకర్తలకు పార్టీ అండ.. : జెడ్పీ చైర్పర్సన్ సరిత
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకూ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతును రాజు చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ పథకాలు అందుతున్నాయంటే టీఆర్ఎస్ పార్టీనే కారణమని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి విజయగర్జన సభకు భారీగా తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
గోస తీర్చిన సీఎం.. : మాజీ ఎంపీ మంద
నడిగడ్డలో అరవై ఏండ్ల సాగునీటి గోసను తీర్చిన గొప్ప పాలనా దక్షకుడు సీఎం కేసీఆర్ అని మాజీ ఎంపీ మం ద జగన్నాథం పేర్కొన్నారు. అలంపూర్ నుంచి కేసీఆర్ చేపట్టిన పాదయాత్రతో ఇక్కడి రైతుల కష్టాలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. చ లించిన ఆయన ముఖ్యమంత్రి అయ్యా క తుమ్మిళ్లతో నీటి గోసకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. ప్రతి రైతూ విజయగర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయ మార్గదర్శిగా నిలిచారని ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్ పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, నాయకులు అతిథులను గజమాలతో సన్మానించారు. స భాప్రాంగణం జై తెలంగాణ, జై కేసీఆర్, జైజై కేటీఆర్ ని నాదాలతో మార్మోగింది. సమావేశంలో జోగుళాంబ ఆల య కమిటీ చైర్మన్ రవిప్రకాష్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ జి ల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు చిన్న బీసన్న, కరుణశ్రీ, మనోరమ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాందేవ్‌రెడ్డి, ఎంపీపీ బీసమ్మ, నాయకులు తిరుమల్‌రెడ్డి, మందశ్రీనాథ్, రమణ, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.