
ఆత్మకూరు, అక్టోబర్ 29 : పట్టణంలో 50 పడకల దవాఖాన నిర్మించేందుకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించి తీర్మానించారు. శుక్రవారం ఆత్మకూరు సర్కారు దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్‌గా హాజరైన ఎమ్మెల్యే పాత దవాఖాన భవనాన్ని తొలగించిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న స్థలంలో నూతనంగా 50 పడకల వైద్యశాల నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు కమిటీతో తీర్మానం చేయించారు. అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దవాఖాన ముందు డ్రైయిన్ నిర్మాణం చేపట్టేందుకు, ప్లంబింగ్ పనులకు, ఎలక్ట్రిసిటీ పనులకు, ఏసీ మరమ్మతు, ఇన్వర్టర్, ఫర్నిచర్, కంప్యూటర్ల కొనుగోలుకు నిర్ణయించారు. అదేవిధంగా దవాఖానలో పనిచేస్తున్న కాంటిజెన్ వర్కర్ల వేతనాన్ని పెంచారు. ఒకరికి రూ.6 వేలు మరొకరికి రూ.5 వేలు ఎక్కువ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్ సమస్యను ప్రస్తావించగా కలెక్టర్, జీవీకే సంస్థ ప్రతినిధులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. త్వరలో ఆత్మకూరు, నర్వ మండల కేంద్రాలకు కొత్త అంబులెన్స్ వాహనాలు వస్తాయన్నారు. సమావేశం అనంతరం బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. తెలంగాణలో సర్కారు దవాఖానల్లో అత్యుత్త మ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమం లో చైర్పర్సన్ గాయత్రీ యాదవ్, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీలు శివరంజని, సరోజ, అమరచింత ఎంపీపీ మాలతి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ అనిల్‌గౌడ్, రైతుబంధు సమితి నేత వీరేశలింగం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవి యా దవ్, కౌన్సిల్ సభ్యులు, తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వైద్యులు లక్ష్మణ్, భరద్వాజ్, శ్రీనివాస్ చౌదరి, నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు.