
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 29 : జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. శుక్రవారం వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో పలు వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కరోనా టీకా అధికారి శంకర్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూ ర్తి చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, డాక్టర్ రఫిక్ పాల్గొన్నారు.
టీకాపై అపోహ వద్దు
గండీడ్, అక్టోబర్ 29 : కరోనా టీకాపై ఎలాంటి అపోహ వద్ద ని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొంరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో కొవి డ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కరోనాను కట్టడి చేసేందుకు 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి
హన్వాడ, అక్టోబర్ 29 : అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీపీవో వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపేట, ఎనమిదితండా గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందరూ సహకరించాలి
మిడ్జిల్, అక్టోబర్ 29 : వందశాతం వ్యాక్సినేషన్‌కు అందరూ సహకరించాలని డీఎంవో విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని వేములలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. వారంరోజుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ వంశీప్రియ, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణ, వైద్యసిబ్బం ది దేవయ్య, జంగయ్య, నీలమ్మ, అంగన్వాడీ టీచర్ ఈదమ్మ, స్వప్న, ఆశ కార్యకర్తలు సుగుణమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో..
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 29 : మున్సిపాలిటీలోని 12వ వార్డులో శుక్రవారం వ్యాక్సినేషన్ ప్రక్రియను మున్సిపల్ చైర్మన్ ప్రదీప్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ఉమర్, డాక్టర్ రఫీక్, ము న్సిపల్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, అక్టోబర్ 29 : కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు. 23వ వార్డులో కౌన్సిలర్ ఉమాశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్, వైద్యసిబ్బంది వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. జడ్చర్ల అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు, వైద్య, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేశారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, అక్టోబర్ 29 : మండలంలోని కేశ్వాపూర్తండాలో శుక్రవారం కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ఇంటింటికెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జయరాం మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో సర్పంచ్ మొగులయ్య పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 29 : మండలకేంద్రంలో శుక్రవారం వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి కొవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శంకర్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే భవిష్యత్‌కు భరోసా ఉంటుందని, అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 29 : మండలంలోని పెద్దబాయితండా, గోరుగడ్డతండాల్లో శుక్రవారం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీడీవో కృష్ణారావు పరిశీలించారు.కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతినాయక్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, అక్టోబర్ 29 : మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నదని మండల వైద్యాధికారి నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మొత్తం 13 బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటికెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 25వేల మందికి మొదటి డోస్, 2,099మందికి రెండోడోస్ వేసినట్లు తెలిపారు.
వైద్యసిబ్బందికి సన్మానం
జడ్చర్ల/రూరల్, అక్టోబర్ 29 : మండలంలోని గోప్లాపూర్‌లో శుక్రవారం కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయింది. ఈ సందర్భంగా సర్పంచ్ చెన్నయ్య ఆధ్వర్యంలో వైద్యసిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీశ్, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఏఎన్ఎం పుష్పలత, ఆశ కార్యకర్త సమం త, అంగన్వాడీ టీచర్ సురేఖ, కృష్ణయ్య పాల్గొన్నారు.