
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్, అక్టోబర్ 23: స్వరాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మండలం సింగవట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్‌లో 7లక్షల 80వేలు బొచ్చ,రవుట,మోసు,రొయ్య చేపపిల్లలను మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మప్పతో కలిసి ఎమ్మెల్యే బీరం శనివారం వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సరదాగా మరబోటులో అరగంట సేపు విహరించారు. ఎమ్మెల్యే బీరం వల సహాయంతో పట్టిన పెద్ద చేపను మత్స్యకారులు డీడీ సుజాతకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బీరం విలేకరులతో మాట్లాడుతూ సమైక్య పాలనలో కునారిల్లిన కులవృత్తుల జీవితాల్లో వెలుగులు నింపేందుకుగానూ సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు శ్రీనివాసులు, కృష్ణయ్య, సర్పంచ్ కృష్ణయ్య, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు నర్సింహ, కార్యదర్శి స్వామి, ఎన్మన్‌బెట్ల, కల్వకోలు, సింగవట్నం మత్స్యకారులతో పాటు మత్స్యశాఖ ఫీల్డ్‌మెన్ అంజయ్య, ఫీల్డ్‌అసిస్టెంట్స్ శ్రీకాంత్, రాజ్‌కుమార్, కాంట్రాక్టర్ సత్యప్రియ, టీఆర్ఎస్ నాయకులు కిరణ్‌కుమార్, గాలియాదవ్, ఖాదర్‌పాషా, సుదర్శన్‌గౌడ్, సుధాకర్ పాల్గొన్నారు.