
మహబూబ్‌నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే ద్విదశాబ్ది విజయ గర్జన సభ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, శాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒకే రోజు తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు సమావేశానికి హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, కల్వకుర్తి, షాద్‌నగర్, కొడంగల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నా యి. ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్, జ డ్చర్ల, 10:30కు దేవరకద్ర, మక్తల్, 11 గంటలకు కల్వకుర్తి, షాద్‌నగర్, 11:30కు కొడంగల్, నాగర్‌కర్నూల్, మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపే ట నియోజవర్గాల సమావేశాలు తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించనున్నారు. మంత్రులు ఎస్. నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు పి.రాము లు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డా.సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్య యాదవ్, నరేందర్ రె డ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కె.దామోదర్‌రెడ్డి, సురభి వాణీదేవి హాజరు కానున్నట్లు సమాచారం.
దూకుడే మంత్రం..
సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతో బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కేటీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంద ని తెలుస్తున్నది. సీఎం కేసీఆర్, పార్టీ నేతలపై ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న అంశంపై ఇకపై పార్టీ దూకుడుగా సమాధానం ఇవ్వాలని స మావేశంలో వివరించే అవకాశం ఉన్నది. నీతి, ని జాయతీకి మారుపేరైన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్త లు.. తమపై అనవస విమర్శలు చేసే వారిపై దూకుడుగా ఉండాలని వెల్లడించొచ్చు. దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో అభివృద్ధి అంశాలు గ్రామీణ స్థాయి ప్రజలకు అందించడంలో వెనకబాటు ఉందని.., అది తొలగిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవిం చి.. రాష్ర్టాన్ని సాధించి 20 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ సభ విజయవం తం చేసే అంశాలపై చర్చించనున్నారు. ప్లీనరీ, వరంగల్ సభల విజయవంతంపైనే కాకుండా పార్టీని సం స్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. నవంబర్ 15 బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేయనున్న శిక్షణ కార్యక్రమాలపై కూడా కేటీఆర్ వివరిస్తారని సమాచారం.
మరింత బలోపేతం చేయడమే లక్ష్యం..
ప్రత్యేక రాష్ట్రం సాధించడమే ల క్ష్యంగా ఉద్యమ నేత కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ గత 20 ఏం డ్లలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వె ళ్లిందో అందరికీ తెలుసు. దేశ చరిత్ర లో ఇంతటి ఘనమైన చరిత్ర ఏ పా ర్టీకి లేదు. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎంతో బలమైన శక్తిగా ఉంది. సంస్థాగతంగా మరింత బలంగా చేయాలన్నది తమ లక్ష్యం. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ గ్రామ స్థా యికి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త పనిచేసే లా సన్నద్ధం చేయనున్నారు. ఈ అంశాలపై కేటీఆర్‌తో శనివారం జరిగే సమావేశంలో చర్చించే అ వకాశం ఉంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా అ త్యంత బలంగా చేయాలనే అం శంపై సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నవంబర్ 15న వరంగల్‌లో జరిగే ద్విదశాబ్ది వి జయ గర్జన సభను విజయవంతం చేసే అంశంపైనా కేటీఆర్‌తో జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.