
సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
జడ్చర్లటౌన్, అక్టోబర్ 31 : దివంగత ఉపప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంగీత,నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జడ్చర్లలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు, నాయకులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలిఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 31 : ప్రతిఒక్కరూ మహనీయులను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. దివంగత ఉపప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో ఏక్తా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లభాయ్ పటే ల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ సా ర్వభౌమత్వం, ఐక్యతను కాపాడేందుకు వల్లభా య్ పటేల్ తీసుకున్న నిర్ణయాలు ఉక్కుమనిషిగా నిలిపాయన్నారు. వందలాది సంస్థానాలను దేశంలో విలీనం చేసి అఖండ భారతావని నిర్మాణానికి పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడా రు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం, జాతీ య ఏక్తా దినోత్సవాన్ని సమన్వయం చేస్తూ శాంతి ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలతోపాటు, పాత్రికేయులు, యువతకు షార్ట్‌ఫిల్మ్, ఫొటో చిత్రీకరణ వంటి అంశాలపై పోటీలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు టీ శ్రీనివాసులు, బీ కిషన్, ఇన్స్పెక్టర్లు సురేశ్, శ్రీనివాస్, అప్పలనాయుడు, రాజేశ్వర్, పోలీసు సంఘం అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.
దేశ సమైక్యతకు పాటుపడాలి
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 31 : దేశ సమైక్యతకు ప్రతిఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. కలెక్టరేట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు కృషి చేస్తామని ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బం ది పాల్గొన్నారు.
పటేల్ సేవలు మరువలేనివి
కోయిలకొండ, అక్టోబర్ 31 : దివంగత ఉపప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎంపీపీ శశికళ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎంపీటీసీ ఆంజనేయులు, ఎంపీడీవో జయరాం, ఎస్సై వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ హరీశ్వర్‌రెడ్డి, నాయకులు భీంరెడ్డి, జగన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 31 : మండల పరిషత్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ ల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎంపీపీ సుశీలారమేశ్నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీవో వెంకట్రాములు, సూపరింటెండెంట్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, అక్టోబర్ 31 : మండల పరిషత్ కార్యాలయంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, సీనియర్ అసిస్టెంట్ అతీఖుర్ రహమాన్, సిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని పలువురు కొనియాడారు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మండలకేంద్రంలో ఆయన చిత్రపటానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 31 : మండలకేంద్రంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, ఉమేశ్, శేఖర్, శ్రీను, శ్రీశైలం పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, అక్టోబర్ 31 : నారాయణపేట జిల్లా కృష్ణ మండల తాసిల్దార్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతకు పటేల్ చేసిన కృషిని కొనియాడారు. అనంతరం సిబ్బంది ఏక్తా దివస్‌పై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ సురేశ్, ఆర్ఐ వెంకట్రాములు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.