
రాష్ట్ర నూతన సచివాలయ భవనం ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులను గురువారం పరిశీలించిన సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్ అన్నీ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉంటూ సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మంత్రులు, కార్యదర్శులు, వీఐపీల చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు సహా భవనప్రాంగణమంతా కలియతిరిగారు. ఈ నేపథ్యంలో మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కొన్ని మోడళ్లకు ఆమోదం తెలిపారు.