
ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న ధాన్యాన్ని అడ్డు కుంటున్నది. వానకాలం సీజన్లో వరి దిగుబడి పుష్కలంగా వచ్చింది. రాష్ట్రంలోని కర్షకులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు కోసం కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నది. అయితే ఏపీ, కర్ణాటకలో తక్కువ ధరలు వస్తుండడంతో అక్కడి రైతులు వరిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దీంతో ఇక్కడి రైతులకు ఇబ్బందులు ఏర్పడుతాయని గ్రహించి సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అధికారులు తనిఖీలు చేస్తే ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే ధాన్యం వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు.
అలంపూర్, డిసెంబర్ 2: దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసింది తెలంగాణ సర్కారు. సీఎం కేసీఆర్ పాలనలో సాగుకు మంచిరోజులు వచ్చాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అండగా నిలుస్తున్నది. రైతు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తూ అన్నదాతల కుటుంబాలకు భరోసాగా నిలిచింది. అయితే పక్క రాష్ర్టాల్లో వరికి గిట్టుబాటు ధరల్లేకపోవడంతో కొంత మంది దళారులు రైతుల అవతారమెత్తి తెలంగాణలో మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తించిన అధికార యంత్రాంగం సరిహద్దులోనే వారికి బ్రేకులు వేసింది. రైతులకు అనుకూల వాతావరణంలో అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రాంత అన్నదాతలకు అన్యాయం జరుగకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే ధాన్యాన్ని రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అడ్డుకట్ట వేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు వద్ద బినామీ బిల్లులతో వచ్చే లారీలను జిల్లాలోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు.ఏపీలో ధాన్యం తక్కువ ధరలకు ఖరీదు చేసిన దళారీలు, తెలంగాణలో మద్దతు ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీలో ధాన్యం క్వింటాకు రూ.1400- 1500 ఉండగా తెలంగాణలో క్వింటాకు రూ.1900 ఉన్నది. ఇదే అదునుగా భావించి ఆంధ్ర నుంచి ధాన్యం అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రాంతం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల నుంచి వచ్చిన లారీలను అధికారులు గుర్తించేందుకు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన జోగుళాంబ గద్వాల జిల్లా 44 వ జాతీయ రహదారి పుల్లూరు టోల్ ప్లాజా, నందిన్నె, బల్గెర, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన ఆధారాలు లేకుంటే వెనక్కి పంపుతున్నారు.
ధాన్యం తరలింపును అడ్డుకోవాల్సిందే..
ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ట్రానికి ధాన్యం వస్తే మనకు నష్టం వాటిల్లుతుంది. వాటిని అడ్డుకోవాలి. ప్రభుత్వం చెక్ పోస్టులు పెట్టి అడుకోవడం సరైనదే. పక్కరాష్ట్రం నుంచి వచ్చి మన ప్రాంతంలో అమ్ముకుపోతే మన ప్రాంత వరి రైతులు నష్టపోతారు. మన రాష్ట్రంలో ధర ఎక్కువగాఉందని ఇక్కడ అమ్మడానికి తెస్తున్నారు.
ఆధారాలు లేకుంటే వెనక్కి..
ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే ధాన్యం వాహనాలను తనిఖీ చేసి సరైన ఆధారాలు లేకపోతే వెనక్కి పంపుతాం. ఇప్పటికే జిల్లాలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. వారం రోజులగా తనిఖీలు కొనసాగుతున్నాయి. సీజన్ ముగిసే వరకు చెక్ పోస్టులు కొనసాగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా వచ్చే ధాన్యం ట్రక్కులను ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్డుకుంటాం.