
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా
గద్వాల, డిసెంబర్ 2: అధైర్యపడొద్దు..అండగా ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కుటుంబానికి భరోసానిచ్చారు. గతనెల 11న ఎమ్మెల్యే బండ్ల తండ్రి వెంకట్రామిరెడ్డి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రత్యేక బస్‌లో గద్వాలలోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. వెంకట్రామిరెడ్డి భార్య రేవతమ్మతో మాట్లాడి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రిజనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వీఎం అబ్రహం, గువ్వల బాలరాజు, పట్నం నరేందర్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ సరిత, సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ స్థానిక నాయకులు ఉన్నారు.