
మాగనూర్, నవంబర్ 2 : పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం ముం దుకు సాగుతున్నది. ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం ప నులు చేపడుతున్నది. మండలంలోని గూర్లింగంపల్లి నుంచి తాళంకెరి గ్రామం వరకు రోడ్డు సరిగా లేకపోవడంతో వా హనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నో ఏం డ్ల నుంచి రోడ్లు నిర్మాణం పనులు చేపట్టాలని ప్రభుత్వాల చుట్టూ తిరిగిన ఆ గ్రామాల నాయకులు విసిగిపోయారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి గూర్లింగంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకు న్న రోజే గ్రామస్తులు సమస్యలను దృష్టికి తీ సుకురాగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణం పనులు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో రూ.35 2.88 లక్షలతో నిధులు పీఎంజీఎస్వై నుం చి మంజూరు చేయించారు. నిధులు మం జూరు కాగానే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి, కేవలం 8 నెల ల్లో పనులు పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం పనులు 6 కిలో మీటర్లు వేయాల్సి ఉందని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. రో డ్డు నిర్మాణం పనులతో నేరెడగందోడ్డి, తా ళంకెరి, గూర్లింగంపలి గ్రామాల వాసులకు ఇబ్బందులు తొలగిపోతాయి. రోడ్డు నిర్మాణానికి కృషి చేసి న ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ణతలు తెలిపారు.
తీరిన ఇక్కట్లు…
రోడ్డు సౌకర్యం సరిగా లేక గ్రామస్తులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. బీటీ రోడ్డు నిర్మాణం పనుల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు మం జూరు కాగానే పనులు ప్రారంభించి కేవలం 8 నెలల్లో పూర్తి చేశాం. ప్రతి గ్రామానికి రోడ్ల నిర్మాణం పనులు చేపడుతున్నాం.
పనులు పూర్తి చేశాం…
రోడ్డు నిర్మాణం పనులు మంజూరు కాగానే యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి, కేవలం 8 నెలల్లో 6 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశాం.
కల నెరవేరింది..
గ్రామానికి రోడ్డు వేస్తారని 30 ఏండ్లుగా ఎదురు చూశాం. కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాలను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ గ్రామాల రూపురేఖలను మార్చి వేశారు. గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఆభివృద్ధికి నాంది పలికారు. గ్రామస్తులందరూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.