
పార్కింగ్..
మహబూబ్‌నగర్‌లో ఇదో పెద్ద సమస్య.. రద్దీగా ఉండే రాజేంద్రనగర్, తెలంగాణ చౌరస్తా, మెట్టుగడ్డ, క్లాక్ టవర్, అశోక్ టాకీస్, ఎర్ర సత్యం చౌరస్తాలు, న్యూటౌన్‌లో ప్రధానంగా కనిపిస్తున్నది. వివిధ పనుల నిమిత్తం బైకులపై బయటకు వెళ్లే ప్రజలకు ఈ ప్రాబ్లమ్ జఠిలమైంది. వివిధ బ్యాంకులు, ప్రైవేటు దవాఖానలు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, ఇతర సంస్థల వద్ద ఎక్కువగా ఉన్నది. పార్కింగ్ సౌకర్యం ఉంటేనే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆయా సంస్థలకు చెందిన వారు భవన యజమానులతో కుమ్మక్కై నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. పార్కింగ్ సౌకర్యం లేకుండా భవన నిర్మాణాలు కట్టడంతో చేసేది లేక వాహనాలను రోడ్లపైనే అడ్డం దిడ్డంగా ఉంచుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టాలు పడుతున్న స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా.. కఠిన చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 2 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ పట్టణం లో వివిధ బ్యాంకులు, ప్రైవేట్ దవాఖానలు, ఇ తర సంస్థలు నిబంధనలు పట్టించుకోకుండా కా ర్యాలయాలు ఏర్పాటు చేయడం ప్రజల పాలిట శాపంగా మారింది. పార్కింగ్ సౌకర్యం ఉంటే మాత్రమే కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. సదరు సంస్థలకు చెందిన వారు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వాహనాలు నిలి పి తమ సేవలు పూర్తి చేసేందుకు వెళ్తున్నారు. ఇంతలో రోడ్లపై వాహనాలు నిలిపారంటూ ట్రా ఫిక్ పోలీసులు ఫొటోలు తీసి ఫైన్ వేస్తున్నారు. అసలే పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయి జనం ఇబ్బందులు పడుతుంటే.. ఈ సమయంలో నో పార్కింగ్ జరిమానాలు చెల్లించే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సమైక్య రా ష్ట్రంలోనే ప్రస్తుతం పట్టణంలో ఉన్న అనేక బ్యాం కులు ప్రారంభమయ్యాయి. వీటన్నింటికీ కనీ సం పార్కింగ్ వ్యవస్థే లేదు. కొత్త భవనాలకూ పరిస్థితి ఇలాగే ఉన్నది. వీటిన్నింటి పర్యావసన మే నేడు పార్కింగ్ కష్టాలు. వాణిజ్య సముదాయాల నిర్మాణాకు పార్కింగ్ సౌకర్యం ఉంటేనే మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వాలి. కానీ, కొం దరు అవినీతి అధికారుల తీరుతో పార్కింగ్ సౌక ర్యం లేకున్నా అనుమతులు ఇచ్చేశారు. మరికొ న్ని చోట్ల పార్కింగ్ సౌకర్యం ఉన్నట్లు తప్పుడు ఆధారాలు చూపించి.. వాటి యజమానులు అ నుమతులు పొందారు. దీనిపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో ఇప్పుడు పా ర్కింగ్ సౌకర్యం లేని కార్యాలయాలపై అధికారు లు దృష్టి సారిస్తున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 50వరకు, ప్రైవేట్ దవాఖానాలు 50 వరకు, డయాగ్నోస్టిక్ సెంటర్లు సుమారు 10 వరకు ఉన్నాయి. వీటన్నింటికీ దాదాపుగా పార్కింగ్ సౌకర్యం లేదు. వీటి సేవల కోసం నిత్యం వేలాది మంది వస్తుంటారు. పార్కింగ్ లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతుంటారు. దీంతో ట్రాఫిక్కూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పట్టణంలో ర ద్దీగా ఉండే న్యూటౌన్, రాజేంద్రనగర్, తెలంగాణ చౌరస్తా, మెట్టుగడ్డ, క్లాక్టవ ర్, అశోక్ టాకీస్ చౌరస్తా, ఎర్ర సత్యం చౌరస్తా సమీపంలో ఈ పరిస్థితి ఇంకా దారుణం. న్యూటౌన్, రాజేంద్రనగర్‌లో ప్రైవేట్ దవాఖానల తీరు ఇంకా ఘోరం గా ఉంటుంది. రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసే దవాఖాన నిర్వాహకులు.. రోగులు, వారి తరఫున వచ్చే బంధువుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం గురించి అస్స లు పట్టించుకోవడం లేదు. డయాగ్నోస్టిక్ సెంట ర్ల తీరు కూడా ఇంతకంటే దారుణంగా ఉంది. షాపింగ్‌మాల్స్, సూపర్మార్కెట్లు ఇదే తీరున వ్యవహరిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్న బ్యాంకులు, దవాఖానలు, ఇతర కా ర్యాలయాలు, వాణిజ్య సముదాయాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించని వారిపై దృ ష్టి సారిస్తామని ట్రాఫిక్ సీఐ అశోక్ తెలిపారు.