
దేవరకద్ర రూరల్, నవంబర్ 2 : పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా అ ధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇరిగేషన్, డబుల్బెడ్రూం, ఆర్అండ్బీ అధికారుల తో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టులను త్వరగా పూ ర్తి చేసి సాగునీరందించాలని సూచించారు. కో యిల్‌సాగర్ ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్లో 25 ఎకరాల భూసేకరణ వల్ల పనులు నిలిచిపోయాయ ని, తక్షణమే రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. భూ సేకరణ పేమెంట్ చే యాలని, ఎడమ కాలువకు సంబంధించి 224 ఎకరాలు, కుడి కాలువ సమస్యలపై అధికారు లు దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గానికి 1,300 డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు కా గా, అనేక గ్రామాల్లో పూర్తి చేయాల్సి ఉందన్నా రు. పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కురుమూర్తి జాతరలో భాగంగా రహదారుల మరమ్మతు పనులను, వేముల ర హదారిని కోజెంట్ కంపెనీ వరకు తక్షణమే పూ ర్తి చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ మా ట్లాడుతూ కోయిల్‌సాగర్ గ్రావిటీ కెనాల్ భూసేకరణ సవరణ ప్రణాళికను మూడు రోజుల్లో స మర్పించాలని ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎడమ కాలువకుగానూ 50 శా తం పనులు పూర్తయిందని, మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్, రెవె న్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వడ్డేపల్లి, జానంపేట, ముచ్చింతల, న ర్సింగాపూర్, పేరూర్ గ్రామాల్లో డబుల్బెడ్రూం ఇండ్లను వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తి చే యాలన్నారు. దేవరకద్ర పట్టణంలో ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రామాల్లో సుం దరీకరణ పనులు చేపట్టాలని, పట్టణంలో రెం డు పార్కులు చేపట్టేలా డీపీవో బాధ్యత తీసుకోవాలన్నారు. మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుపై కూ డా దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, జిల్లా ప్రాజెక్టుల సీఈ రమేశ్, ఆర్డీవో పద్మశ్రీ, తాసిల్దార్ జ్యోతి, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్, డీపీవో వెంకటేశ్వర్లు, పీఆర్ ఈఈ నరేందర్, హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, ఇరిగేషన్ ఎస్ఈ నర్సింగ్‌రావు, ఆర్అండ్బీ ఈఈ స్వామి, ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, ఏఎంసీ చైర్పర్సన్ సుగుణ, ఏఈలు పాల్గొన్నారు.