Missing Weapons case : సికింద్రాబాద్లో గత నెల 30న మద్రాస్ రెజిమెంట్లో చోరీకి గురైన ఆయుధాల కేసులో ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ ఆయుధాల చోరీ ఒక్కరోజులో జరిగింది కాదని, మూడు నెలలుగా ఒక్కో ఆయుధాన్ని మాయం చేశారని గుర్తించారు. ఆయుధాగారం వద్ద రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీటీవీ కెమెరాలు ఆపేసి, డ్యూటీలో ఉన్న గార్డులను వేర్వేరు పనులపై పంపించి ఆయుధాలను మాయం చేశారు.
ఇదంతా దొంగల పనిగా చిత్రీకరించేందుకు ఘటన జరిగిన రోజున తాళాలు పగలగొట్టి నిందితులు డ్రామా ఆడారు. అయితే ఎవరి కోసం ఆయుధాలు దొంగలించారు..? ఉగ్రవాద కుట్ర దాగి ఉందా..? నేరుగా అధికారులే ఈ పని చేశారా..? లేక అగ్నివీర్లను బెదిరించి చేయించారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్, మిలిటరీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.