హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌తో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ భేటీ అయ్యా రు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మోహన్‌యాదవ్.. రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యా రు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతు న్న కార్యక్రమాలను రేవంత్.. మధ్యప్రదేశ్ సీఎంకు వివరించారు.
బీజేపీ సీఎం హడావుడిగా రాత్రి హైదరాబాద్‌కు వచ్చి, కాంగ్రెస్‌కు చెందిన సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రాష్ర్టాల మధ్య ఏమైనా ఒప్పందాల కోసమో లేదా అభివృద్ధి, పథకాలను తెలుసుకునేందుకైతే అధికారులతో కలిసి వచ్చి ఇక్కడి అధికారులతో భేటీ అయి చర్చించి తెలుసుకోవాలి. కానీ రాత్రిపూట అధికారగణం లేకుండా వచ్చి కలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.