నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామంలోని మడవి వంశీ యులు డెబ్మాల్లకు ఎడ్ల బండ్లు, కాలినడకన వెళ్లి ఆరాధ్యదైవమైన నాగోబా దేవతకు (Goddess Nagoba) సంప్రదాయ పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. జామడ గ్రామంలో మడవి వంశీయులకు ఘన స్వాగతం పలికారు.

శుక్రవారం ఖైరదట్వా గ్రామంలోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కటోడ మడవి చిత్రు, మడవి జంగు పటేల్ తెలిపారు. పుష్యమాసంలో నాగోబాకు తమ సాంప్రదాయ పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం ఆనావాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మడవి గోవిందరావు, మడవి మోతిరామ్, మడవి జైవంతరావు, మర్ప జాకు, వంశీయులు ఉన్నారు.