madanapuram: సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు..

మదనాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా బుద్ది చెబుతామని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు అన్నారు. దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కొండా ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించి నందుకు నిరసనగా, మదనాపురం మండలంలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
సోమవారం మండలంలోని దంతనూరు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమం నిర్వహించాలని ప్రయత్నించగా, టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎలా దూషిస్తారని నిలదీశారు. ప్రశాంత్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయించి, క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు కలగజేసుకొని ప్రశాంత్‌రెడ్డిని మదనాపురం రైల్వేగేటు సమీపంలో అరెస్టు చేశామని చెప్పడంతో, టీఆర్ఎస్ కార్యకర్తలు శాంతించారు.
అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ నాయకులు…
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీ.ఆర్. అంబ్కేదర్ విగ్రహానికి కాంగ్రెస్ జెండాలు పెట్టి జి.మధుసూదన్ రెడ్డి తదితరులు పూలదండలు వేసి, రాజకీయాల గురిం చి మాట్లాడి, మహానుబావున్ని అవమానించారని పేర్కొంటూ, టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సంర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు రాములు, ఎంపీపీ పద్మావతి, జడ్పీటీసీ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.

దళితబంధు పథకం అమలైతే, ఎక్కడ తమకు పుట్టగతులు ఉండవేమోనని బయపడి నీతిమాలిన రాజకీయాలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. దళిత బంధు పథకం ఎట్టి పరిస్థితుల్లో అమలు కాకూడదనే దురుద్దేశంతో, గ్రామాలకు వెల్లి అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పద్దతి మార్చుకోకుంటే ప్రజలే వారికి తగిన బుద్ది చెబుతారని హితవు పలికారు.
దేవరకద్ర నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులతో సఖ్యతగా ఉండని కాంగ్రెస్ నేత మధుసూదన్‌రెడ్డి, ప్రజలను ఉద్దరిస్తానంటు రావడం విడ్డూరంగా ఉం దన్నారు. రాజకీయ ఉనికి కోసం వారు ఇదంతా చేస్తున్నారని, ప్రజలను మోసం చేడంలో కాంగ్రెస్ నాయకులకు తెలిసినంతగా, తమకు తెలియదన్నారు. మరోసారి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై అవాకులు, చెవాకులు పేలితే ఊరుకునేది లేదని, అలాంటి వారిని గ్రామాల్లో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. ముందుగా ఇంట గెలిచి, రచ్చ గెలవాలని జీఎంఆర్‌కు, టీఆర్ఎస్ నాయకులు సలహా ఇచ్చారు. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సీనీయర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

